ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలో వాతావరణం కూల్ అయ్యింది. పలుచోట్ల చిరుజల్లులు కురిసాయి. దీంతో ఎండ నుంచి జనం ఉపశమనం పొందారు. అటు వాతావరణ శాఖ తెలుగు ప్రజలకు చల్లటి కబురు అదించింది. నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. రుతుపవనాల కారణంగా.. 4 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. తెలంగాణతో పాటు.. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
మరోవైపు రేపు కేరళ, తీరప్రాంత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

